1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
గిరిజన మహిళాపై దాడికి పాల్పడిన బుడ్డిగ కొండమ్మ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.!
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలి.
ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం 1/70 చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని, అటువంటి వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని,గిరిజన మహిళపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేస్తూ ,గిరిజన సంఘం కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించరూ.
సమస్యలతో కూడిన మెమొరాండం తాసిల్దారుకు అందజేశారు.
అనంతరం గిరిజన సంఘం మండల కార్యదర్శి టి క్రిష్ణరావు,నాయకులు వి లక్ష్మణ్రావు గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ,,సర్వ హక్కులు కలిగిన గిరిజనుడు కంబ శ్రీను కు ప్రభుత్వం కేటాయించిన స్తలం లో నిర్మాణం చేసుకుంటుంటే, గిరిజనేతరురాలైన బుడ్డిగ కొండమ్మ వచ్చి పనులను ఆటంకం పరుస్తూ, సామగ్రిని పాడుచేసి,పని వాళ్ళమీద శ్రీను అక్కగారీమీద దాడికి పాల్పడడం హేయమైన చర్యఅన్నారు,
ఏ హక్కులేని గిరిజనేతరురాలు బుడ్డిగ కొండమ్మ, గిరిజనుడిపై పిర్యాదు చేస్తే, ఎమ్మార్వో నోటీసు కూడా ఇవ్వకుండా నిర్మాణం ఆపాలని ఆదేశించడం వెనుక అంతర్యం ఏమిటనీ వారు ప్రశ్నించారు., దాడికి పాల్పడిన బుడ్డిగ కొండమ్మ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు
మండలం కేంద్రంలో గిరిజనేతరులు విపరీతంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. వారిపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోగా,, గిరిజనులు చేపడుతున్న నిర్మాణాలను ఆపాలని నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజేశమనీ వారు ప్రశ్నించారు.
ఎమ్మార్వో కార్యాలయానికి అనుకొని ఉన్న భూమిని కొండమ్మ ఆక్రమించుకొని,అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
తక్షణమే ఆక్రమణ దారులపైనా,అక్రమ నిర్మాణాలపైనా చర్యలు చేపట్టకపోతే ఆదివాసులతో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం నాయకులు అప్పారావు,బుజ్జిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.