బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ – యువతకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం

Bureau March 19, 2026 05:09 PM 4 views
ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ – యువతకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం

ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ – యువతకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం

* జాబ్ క్యాలెండర్ విడుదల పై హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి 
 భోగాపురం, దివ్య దర్శిని న్యూస్ :

ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నెల్లిమర్ల ఎమ్మెల్యే  లోకం నాగ మాధవి  హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. యువగళం హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తోంది. ఇప్పటికే కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది అని ఆమె తెలిపారు. అదేవిధంగా 

 రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానిస్తూ, సుమారు 25 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు.
“శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదలైన జాబ్ క్యాలెండర్ యువతలో నూతన ఆశలు నింపుతూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది” అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంపై స్పందిస్తూ,
“జగన్ పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఉపాధి లేక వేలాది మంది యువత తీవ్ర నిరాశకు గురయ్యారు” అని విమర్శించారు.

ఇక ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్  నాయకత్వంలో కూటమి ప్రభుత్వం యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తోందని కొనియాడారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```