బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా

Bureau February 01, 2026 07:28 AM 10 views
 ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 4-6, 6-4, 4-6 తేడాతో ఐదో సీడ్ ఎలైనా రైబకినా చేతిలో ఓటమిపాలైంది. అద్వితీయమైన ప్రదర్శనతో వరల్డ్ నెంబర్ వన్ సబలెంకా‌కు షాకిచ్చిన ఎలైనా రైబకినా కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.

తొలి సెట్‌లో ఆధిపత్యం చెలాయించిన రైబకినా 37 నిమిషాల్లోనే 6-4తో గెలిచింది. రెండో సెట్‌లో సబలెంకా పుంజుకోవడంతో పోరు హోరాహోరీగా మారింది. 55 నిమిషాల పోరాటం తర్వాత 6-4తో సబలెంకా రెండో సెట్ కైవసం చేసుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ సెట్‌లో రైబకినా వెనుకంజలో నిలిచినా.. పట్టు విడవకుండా పోరాడి 46 నిమిషాల్లో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు తొలి టైటిల్‌ను ముద్దాడింది.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```