బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

అనకాపల్లి జిల్లా అభివృద్ధి పరుగులు… ప్రతిరోజు పెట్టుబడుల పండుగ

Bureau April 24, 2026 04:46 AM 4 views
 అనకాపల్లి జిల్లా అభివృద్ధి పరుగులు… ప్రతిరోజు పెట్టుబడుల పండుగ

  అనకాపల్లి జిల్లా అభివృద్ధి పరుగులు… ప్రతిరోజు పెట్టుబడుల పండుగ

సీఎం గారి విజన్‌తో భారీ పరిశ్రమలు – వేల ఉద్యోగాలకు దారి

గత వైసీపీ పాలనలో ఇటువంటి కార్యక్రమాలు ఒకటి చేసుకోలేకపోయాం

రంగారెడ్డిని జిల్లాను మించే దిశగా అనకాపల్లి జిల్లా మారబోతోంది.

రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌కు చెందిన రెండు ప్లాంట్ల భూమిపూజ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలియజేసిన అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని, ప్రతిరోజూ పెట్టుబడుల పండుగ జరుగుతోందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీ.ఎం రమేష్ గారు తెలిపారు.రాంబిల్లి మండలం జెడ్ చింతువలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన రెండు భారీ ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రులు, శాసనసభ్యులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలుకానున్నాయి.రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ద్వారా సుమారు 2,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

భూమిపూజ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అనకాపల్లి ఎంపీ గారు మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా అభివృద్ధిపై ఆయన చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమన్నారు.గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అనకాపల్లి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.పారిశ్రామికంగా జిల్లా ఎదగడం ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఇప్పటికే నక్కపల్లి ప్రాంతంలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్, మెటల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు స్థాపించబడుతున్నాయని, తాజా ప్రాజెక్టులు అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతున్నాయని చెప్పారు.గత ఐదేళ్లలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనిపించలేదని విమర్శిస్తూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ స్థాయి ప్రగతి జరగలేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ ముందంజలో ఉందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పారిశ్రామిక వేత్తలకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షిత కేంద్రంగా మారిందన్నారు.స్థానిక రైతులకు భరోసా ఇస్తూ, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. భూముల విలువలు భవిష్యత్తులో అమాంతం పెరుగుతాయని, గతంలో రంగారెడ్డి జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో అదే విధంగా అనకాపల్లి జిల్లా కూడా వేగంగా ఎదుగుతుందని తెలిపారు.అనకాపల్లి జిల్లా భవిష్యత్తులో రంగారెడ్డి జిల్లాను మించి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారని వెల్లడించారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```