అనకాపల్లి సీతంపేట కబడ్డీ ప్రైజ్ అనకాపల్లి టీం సొంతం
మండలంలోని సీతంపేట మరిడిమాంబ తీర్థ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబాడీ పోటీలు శుక్రవారం అర్ధరాత్రి తో ముగిసాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 22 జట్లు మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. చివరగా కబడ్డీ పోటీలలో అనకాపల్లి టీం ఫస్ట్ ప్రైజ్ సొంతం చేసుకుంది. వీరికి నాగయ్య పేట పంచాయితీ మాజీ సర్పంచి ఆదిరెడ్డి శంకర్ సత్యవతి ఈశ్వరరావు రూ. 30 వేల రూపాయలు అందజేశారు. అలాగే రెండో విజేతగా తురువోలు కబడ్డీ జట్టు రెండో స్థానం కైవసం చేసుకుంది వీరికి కొట్యాడ జోగినాయుడు, గొర్లి సతీష్ అందజేసిన రూ. 20వేల రూపాయలను అందజేశారు. అలాగే ద్వితీయ స్థానం బొడ్డపాడు, జామి కబడ్డీ జట్లు సొంతం చేసుకున్నాయి వీరికి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షుడు తమన సూరిబాబు అందజేసిన రూ.10వేల రూపాయలను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మరిడిమాంబ తీర్థ మహోత్సవం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.