విశాఖ నగర సుందరికరణకు రాత్రి పారిశుధ్యం,వీధి దీపాల నిర్వహణే కీలక పాత్ర.
* రాత్రి పారిశుధ్యం , వీధి దీపాల నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ.
విశాఖపట్నం, ఫిబ్రవరి 24: విశాఖ నగర సుందరికరణకు రాత్రి పారిశుధ్యం,వీధి దీపాల నిర్వహణే కీలక పాత్ర అని, నగరంలోని రాత్రి వేళల్లో పారిశుద్ధ్యం , వీధి దీపాల నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సోమవారం ఆయన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసరాలు, జగదాంబ జంక్షన్ నుండి పూర్ణ మార్కెట్ వరకు విస్తరించిన ప్రాంతం, బీచ్ రోడ్డు, ఎంవిపి కాలనీ,అప్పు ఘర్ సమీప ప్రాంతాలలో ఫీల్డ్ స్థాయిలో రాత్రిపూట జరుగుచున్న పనులను తనిఖీ చేస్తూ సమీక్షించారు.
ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ, విశాఖ నగర సుందరీకరణకు ముఖ్యంగా నిత్యం రాత్రి పూట నిర్వహిస్తున్న రోడ్లు, ఫుట్ పాత్ లు, బహిరంగ ప్రదేశాలు లు,కాలువల పరిశుభ్రత,పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు నిర్వహణ ఎంతో కీలకమన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులను నిబద్ధతతో , నిజాయితీతో నిర్వహించాలని ప్రోత్సహించారు. రాత్రి వేళల్లో నగర పరిశుభ్రతను కాపాడడంలో వారి పాత్రను ప్రశంసిస్తూ, రాత్రి పారిశుధ్య సిబ్బంది కృషిని అభినందించారు.
పారిశుధ్య కార్మికులకు విధి నిర్వహణకు అవసరమగు పరికరాలు లోటు లేకుండా సమకూర్చాలని , వాణిజ్య సముదాయాల వ్యర్థాల సేకరణను మరింత బలోపేతం చేసి, వ్యాపారులు వ్యర్ధాలను బయట పడవేయకుండా నిత్యం జేబీఎంసీ వాహనాలకు అందించేలా అవగాహన పరుస్తూ పర్యవేక్షించేయాలని ,వీధి దీపాల నిర్వహణ , సమర్ధవంతమైన పనితీరును పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.విశాఖ నగరంలో పారిశుధ్యం , వీధి దీపాలు నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ జరుపుతూ విశాఖ నగరాన్ని మరింత సుందరీకరణతో అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు జివీఎంసీ అధికారులు ,ఉద్యోగులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధి నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.