దివ్య దర్శిని గొలుగొండ
మండలం లో కృష్ణదేవిపేటలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహణ ముఖ్యఅతిథిగా నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్
బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధిస్తారని ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పిలుపునిచ్చారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని చెక్కా వెంకట పద్మావతి కల్యాణ మండపంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్ మరియు అనకాపల్లి జిల్లా పోలీసుల సౌజన్యంతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కంగారు పడకుండా ఉత్సాహంగా చదువుపై దృష్టి సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం నాతవరం ఎస్సై వై.తారకేశ్వరావు, వ్యాపారవేత్త బొప్పన హరి సమకూర్చిన క్రీడా దుస్తులను యండమూరి వీరేంద్రనాథ్ కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వర రావు చేతుల మీదుగా క్రీడాకారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చోద్యం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలలు జూనియర్ కళాశాలలు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు