బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

యువత భవిష్యత్తు కోసం అవగాహన  కార్యక్రమం

Bureau February 21, 2026 05:17 AM 3 views
యువత భవిష్యత్తు కోసం అవగాహన  కార్యక్రమం

యువత భవిష్యత్తు కోసం అవగాహన  కార్యక్రమం  – మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని  సి ఐ  సూచన
 

 లక్కవరపుకోట   దివ్యదర్శని 

 లక్కవరపుకోట మండలం కొట్టాడ గ్రామంలో యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సిఐ తెలిపారు
 సిఐ మాట్లాడుతూ 
  గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, మాదక ద్రవ్యాలు ఏమైనా దాచిపెట్టారా అన్న అనుమానాల నేపథ్యంలో గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ ప్రదేశాలు పరిశీలించి, గ్రామ ప్రజల వివరాలు సేకరించారు.

అనంతరం బెహరా కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత భవిష్యత్తు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసాలకు గురికాకూడదని అవగాహన కల్పించారు. మీ చుట్టుపక్కల ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎల్.కోట ఎస్‌ఐ, వల్లంపూడి ఎస్‌ఐ, జామి ఎస్‌ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇటువంటి కార్డెన్ సెర్చ్‌లు తరచుగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```