బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

మునగపాకలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

Bureau February 21, 2026 05:13 AM 3 views
మునగపాకలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

మునగపాకలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

పాత నేరస్తుడు అరెస్ట్ ​రూ.30.39 లక్షల విలువైన 16.5 తులాల బంగారం స్వాధీనం: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్. 

అనకాపల్లి (మునగపాక), ఫిబ్రవరి 20, 2026: మునగపాక మండలంలో జరిగిన భారీ గృహ దొంగతనం కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా, కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఈరోజు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, రికవరీ చేసిన సొత్తును వెల్లడించారు.

కేసు వివరాలు & దర్యాప్తు: ​ఫిబ్రవరి 15న శివరాత్రి పర్వదినం సందర్భంగా మునగపాక మండలం, గంతవానిపాలెంకు చెందిన శ్రీమతి కరణం ఉమావతి గారు తన ఇంటికి తాళం వేసి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలోని 17.5 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు (Cr.No: 55/2026) కేసు నమోదు చేశారు. 

పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి, ఫిబ్రవరి 19 రాత్రి కొక్కిరపల్లి జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.

నిందితుడు & నేర చరిత్ర: ​అరెస్ట్ అయిన నిందితుడు కోన రాజేష్ (23), అనకాపల్లి టౌన్ నివాసి. ఇతను పాత నేరస్తుడు (Repeat Offender) అని విచారణలో తేలింది. ఇతనిపై గతంలోనూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు గృహ దొంగతనం కేసులు నమోదయ్యాయి:
​Cr. No.154/2025 (HB Night)
​Cr. No.141/2025 (HB Night)
​ప్రస్తుతం నిందితుడి నుండి 16.5 తులాల (192.3 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.30,39,000/-. 

​నేర నియంత్రణలో జిల్లా పోలీసుల ప్రగతి (2024 - 2026): 
​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తీసుకుంటున్న పటిష్ట చర్యల వల్ల దొంగతనాల కేసులలో రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలను వివరించారు:
2024 సంవత్సరంలో 46% కేసుల్లో డిటెక్షన్, 60% శాతం ప్రాపర్టీ రికవరీ, 2025 సంవత్సరంలో 59% కేసులలో డిటెక్షన్, 63% ప్రాపర్టీ రికవరీ, 
​"2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన రెండు ప్రధాన (Grave) కేసులలోనూ 100% డిటెక్షన్ మరియు 100% ఆస్తి రికవరీ సాధించడం జిల్లా పోలీసుల పనితీరుకు నిదర్శనం" అని ఎస్పీ గారు కొనియాడారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```