బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి

Bureau February 05, 2026 06:25 PM 6 views
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం :  మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి

దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి అన్నారు. మండల కేంద్రంలోని  రైవాడ అతిథి గృహం వద్ద గురువారం మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు అధ్యక్షతన ప్రధానమంత్రి ఉజ్వల యోజన మూడవ విడత ఉచిత గ్యాస్ కలెక్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుతూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వెనకాడ లేదన్నారు. మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర పథకాలు కొనసాగుతున్నాయన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్  ఉచితంగా అందజేస్తామన్నారు. మండలంలో 632 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 566 గ్యాస్ కనెక్షన్ లు మంజూరయ్యాయని, త్వరలో మిగిలిన వారికి కూడా అందజేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారును భాస్కరరావుతో సహా పలువురు సత్కరించారు. అనంతరం దేవరాపల్లికి చెందిన అనిమిరెడ్డి మల్లికకు వెలుగు ద్వారా ఎగ్ మార్ట్ సెంటర్ మంజూరు కావడంతో  ఆ పథకాన్ని ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె వి ఎల్ ఎన్ మూర్తి, తహశీల్దార్ పి. లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎం వి సువర్ణరాజు, ఏపీఎం ఎస్. ప్రభాకరరావు, సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, మండల టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు పెద్దాడ వెంకటరమణ, దొగ్గ దేముడు నాయుడు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గొర్రుపోటు రామ్మూర్తి నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు పూడి సత్యరావు, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు బండారు రామారావు, శరఖాన సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, కొరుప్రోలు రామలింగస్వామి, చల్లా తాతయ్యలు, గుల్లిపల్లి అర్జునరావు, గంధం జగ్గారావు(జగన్), కడిమి నాగేశ్వరరావు, అల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```