బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

మహిళల ఉజ్వల భవితకు 'కిశోరి వికాసం'

Bureau May 16, 2026 07:14 AM 0 views
మహిళల ఉజ్వల భవితకు 'కిశోరి వికాసం'

మహిళల ఉజ్వల భవితకు 'కిశోరి వికాసం'
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
యుక్త వయసు బాలికలు, మహిళల ఉజ్వల
భవితకు కిశోర వికాసం కార్యక్రమం ఉపయుక్తమని ఐసిడిఎస్ సిడిపిఓ పి. లలిత కుమారి పేర్కొన్నారు. మండలంలోని దేవరాపల్లి, కలిగొట్ల, చిననందిపల్లి, వేచలం గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడీ సూపర్వైజర్లు కళ్యాణి, రాములమ్మ, ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్యం, పోషణ, రక్షణ, వ్యక్తిగత వికాసం సాధికారత లక్ష్యమన్నారు. ఋతుక్రమ ఆరోగ్యం (ఎంహెచ్ఎం), వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్/బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ (1098), యోగా వంటి అంశాలపై 11 రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) లో కూడా శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడి బోధకరాళ్లు జయలక్ష్మి, రమణమ్మ, నాగమణి, ఎర్నమ్మ, హైమావతి, వైద్య సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమాలను పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```