బైకు దొంగ అరెస్టు
రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
నాతవరం దివ్యదర్శని న్యూస్: బైకులు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు బైకులు స్వాధీనపరుచుకున్నామని నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మైత్రి పోలీసింగ్ లో భాగంగా ముందస్తు సమాచారం రావడంతో వలసంపేట జంక్షన్లో శుక్రవారం మధ్యాహ్నం పల్సర్ మోటార్ బైక్ పై వెళుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ @చెన్నైగా గుర్తించామని అన్నారు. జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేసి తాళాలు బద్దలు కొట్టి దొంగిలిస్తున్నట్లు అంగీకరించాడు. ఇతని వద్ద పల్సర్ 160 ద్విచక్ర వాహనం, స్కూటీ స్వాధీన పరుచుకున్నామన్నారు. ఈ మధ్యకాలంలో తాండవ జంక్షన్ లో బైక్ చోరీ జరిగిన విషయం తెలిసిందే సిసి ఫుటేజ్ లు ఆధారంగా దుర్గాప్రసాద్ గా గుర్తించామని నిందితుడను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.