గంగవరం ఏజెన్సీ డిడి న్యూస్:
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పోలవరం జిల్లాలో ఓబీసీ విభాగానికి సంబంధించి కీలక నియామకాలు జరిగాయి. ఈ మేరకు పోలవరం జిల్లా ఓబీసీ పదాధిపతుల సమావేశాన్ని నిర్వహించి, పార్టీ బలోపేతం దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు మఠం శాంతి కుమారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు కాలపు సాయిరాం, జిల్లా అధ్యక్షుడు ఐవివి ప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
గంగవరం మండలం నుంచి ఆవాలు దుర్గ ప్రసాద్‌ను పోలవరం జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే మేడ శెట్టిసూర్యచంద్రరావును పోలవరం జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీగా పార్టీ అధిష్టానం నియమించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓబీసీ వర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో కొత్తగా నియమితులైన పదాధికారులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పోలవరం జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, ఓబీసీ విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.