బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా

Bureau January 03, 2026 02:09 AM 31 views
ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా

ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనుకూడా జిమ్‌లో జాయిన్‌ అవుతా.. అంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ అన్నారు. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో సిబ్బందికి సూచన చేస్తూ పోస్టు చేశారు.

2026 ప్రణాళికను ఎక్స్‌లో పోస్టు చేసిన సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: పోలీసులు ఉద్యోగ విధులను, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకోవాలని, ఫిట్‌నెస్‌ విషయంలో రాజీ పడొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌(Hyderabad Police Commissioner V.C. Sajjanar) పేర్కొన్నారు. ఈ మేరకు 2026 సంవత్సరంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను, నేరనియంత్రణకు సిద్ధం చేసిన ప్రణాళికలను ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.

‘చాలాకాలంగా ఫిట్‌నెస్ కోసం (వ్యాయామం) జిమ్‌కు వెళ్లాలని అనుకున్నాను. కానీ పని ఒత్తిడి వల్ల కుదరలేదు.. ఇకపై ఆరోగ్యం విషయంలో రాజీపడేదిలేదు. త్వరలోనే జిమ్‌లో చేరుతా..’ అని సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. పుస్తక పఠనానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని, అన్నింటికంటే ముఖ్యంగా.. కుటుంబ సభ్యులు, మిత్రులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```