బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ప్రారంభం దశలోనే సికిల్ సెల్ అనీమియా ను గుర్తించాలి : జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

Bureau February 04, 2026 05:11 AM 5 views
ప్రారంభం దశలోనే సికిల్ సెల్ అనీమియా ను గుర్తించాలి : జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు) :


 సికిల్ సెల్ అనీమియా ను  నివారించే విధముగా జిల్లాలో  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలనీ, మలేరియా కేసులను  తగ్గించే విధముగా చర్యలు చేపట్టాలనీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ , ఇతర సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలవరం , రంపచోడవరం రెండు జిల్లాల అధికారులతో జిల్లాల పరిధిలోనిగల పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో ఆయన మాట్లాడుతూ జిల్లా లో సికిల్ సెల్ అనీమియా ఉన్నందున జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ క్షేత్ర స్థాయిలో  రక్త పరీక్షలు నిర్వహించి కేసులని గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా లో మలేరియా నిర్మూలన కొరకు పరిసరాలను పరిశుబ్రముగా ఉంచి , దోమ తెరలను వాడాలన్నారు.  యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లో 38 ప్రశ్నలతో సర్వే నిర్వహించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారులు దానిని సకాలంలో పూర్తి చేయాలనీ, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించడం జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హత ఉన్న అందరికి అందేటట్లు సర్వే చేపట్టాలన్నారు. సిగ్నల్  సమస్యలను అధిగమించి సర్వే  పూర్తి చేయాలన్నారు. అక్షర ఆంధ్రా కార్యక్రమములో భాగముగా వాలంటీర్లు , లెర్నర్ ల  రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, గ్రామా,వార్డ్  సచివాలయాలను ఎంపిడివో లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలనీ, సిబ్బంది హాజరు నమోదు సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ , వార్డ్ సచివాలయాల సిబ్బంది పని తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని పని తీరు మేరుగుపరుచోకోవలన్నారు. పంపిణీ చేసిన టేక్ హోం రేషన్ సమాచారాన్ని సకాలంలో ఆన్లైన్ నందు అప్లోడ్ చేయాలనీ స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారులను , పి యం  జన ఆరోగ్య యోజన పధకంలో భాగంగా ఈ కే వై సీ పూర్తి చేయాలనీ , గర్బిణీ స్త్రీల ను మొదటి ప్రాధాన్యత నిచ్చి  పధకం అవగాహనా కొరకు కింది స్థాయిలో అవగాహనా సదస్సులు జిల్లా వైద్య , ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు . జిల్లా లో ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణీత సాధించే విధముగా  విద్యాశాఖ అధికారులు 100 రోజులు ప్రణాళికలు తయారుచేయాలన్నారు.

ఈ కార్యక్రమములో జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ  పివో తిరుమణి శ్రీ పూజ, రంపచోడవరం ఐటిడిఏ పివో స్మరన్ రాజ్ ,  జిల్లా పంచాయతీ అధికారి శేఖర్ , జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నాయక్ , స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారి ఝాన్సీ రామ్ పడాల్ , నీటి యాజమాన్య సంస్థ అధికారి విద్యాసాగర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```