బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సిబ్బంది నిరసన

Bureau February 21, 2026 05:15 AM 4 views
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సిబ్బంది నిరసన

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సిబ్బంది నిరసన

సీతానగరం:- జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా మండలంలో రఘదేవపురం గ్రామంలో డిస్టిక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా మండలంలో ఉన్న 11 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేయుచున్న సిబ్బంది నిరసనకుదిగారు. ఈ సందర్భంగా నిరసన కారులు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2019 సంవత్సరం తరువాత నియామకాలు పొందిన వారిని పర్మినెంట్ చేయాలని కోరుతున్నామని అన్నారు. అలాగే ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచాలని కోరుతున్నామని అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల 36 జీవో ప్రకారం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారికి జీతాలు పెంచాలని,స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్ ను అందించాలని,ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం అందించే పే స్కేల్ ను 5 లక్షల వరకు పెంచాలని కోరుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```