నెలరోజులపాటు కొనసాగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నేటితో ముగుస్తుzన్నాయి. అయినా శృంగవరపుకోట ఆర్.టి.సి.డిపోలో కొందరు రవాణా సిబ్బంది వలన ప్రయాణీకులు యిబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధినిర్వహణలో ఉన్న కొంతమంది కండక్టర్లు ఆర్.టి.సి.బస్సును తమ ప్రైవేటు కార్యాల కోసం నచ్చిన చోట నిలుపుకోవడం, ఏ దుకాణ వ్యాపారస్తుడికో లబ్ది చేకూర్చడం కోసం పరిమితి లేని చోట నిమిషాల కొద్దీ నిలపడం, నిలపాల్సిన బస్టాండులో కొద్ది సేపుకూడా నిలపకుండా దిగండంటూ ప్రయాణీకులను తొందరపెట్టడం, మిగుల్చుకున్న సమయాన్ని తమ ప్రైవేటు వ్యవహారాలకు కేటాయించుకోవడం, గమ్యం చేరాక ప్రయాణికులు దిగక ముందే కండక్టర్లు బస్సు విడిచి వెళ్ళిపోవడం తద్వారా ఎక్కేందుకు ఉరికే ప్రయాణికులతో దిగవలసిన ప్రయాణికులు దిగేందుకు చోటులేక అవస్థలు పడ్డం, ముఖ్యంగా చిన్న పిల్లలతో ఉన్న ఆడవారు పలు ఇబ్బందులకు గురికావడం సాధారణమైపోయాయి గత కొంత కాలంగా. ఇది ఇలా ఉండగా పార్కింగుకు కేటాయించిన స్థలంలో గుత్తేదారులు యిష్టానుసారంగా వ్యవహరించడం వలన పార్కింగు అస్తవ్యస్తంగా తయారైంది. శృంగవరపుకోట పరిధిలో గల కొత్తవలస బస్టాండులో పార్కింగ్ గత మూడు సంవత్సరాలుగా దారుణంగా తయారైంది. బస్సులు నిలిపే స్థలం పక్కనే నో పార్కింగ్ అని వ్రాసిన చోట ప్రైవేటు వాహనాలు నిలిపినా నియంత్రణ లేదు, జరిమానాలు లేవు. పార్కింగ్ కు కేటాయించిన స్థలములోనే కాకుండా ప్రతీచోటా వాహనాలు నిలిపి కనబడుతున్నాయి. మరుగుదొడ్డి వద్ద కూడా వాహనదారుల పార్కింగ్ కారణంగా అత్యవసరమై మరుగుదొడ్డికి వెళ్ళాల్సిన స్త్రిలు సంకోచించవలసివస్తుంది. ఇది వారి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. స్త్రీల హక్కులకు కలుగుతున్న భంగంగా చెప్పవచ్చు. పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యతలను డిపో మేనేజరు గా వస్తున్న ప్రతివారూ గాలికి వదిలేస్తున్నారు. కొందరి అసమర్ధత కారణంగా మొత్తం వ్యవస్థ పైనే విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.
ప్రయాణీకుల భద్రత గాలికి
Bureau
February 01, 2026 07:10 AM
7 views
Related News
సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
Jan 29
గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత
Feb 07
రామతీర్థం రామస్వామి దేవస్థానం మాడ వీధులకు మోక్షం
Feb 13
యువత భవిష్యత్తు కోసం అవగాహన కార్యక్రమం
Feb 21
ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ – యువతకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం
Mar 19
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N