బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా

Bureau May 16, 2026 06:49 AM 2 views
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా

విశాఖపట్నం, మే 15: భీమిలి నియోజకవర్గం ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మధురవాడ జోన్ 8 వ వార్డు పరిధిలోని గుడ్లవానిపాలెం, సాగర్ నగర్, సుభాష్ నగర్, రాజీవ్ నగర్ లలో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు నిర్మించాలని.. 5 వ వార్డు సాయిరాం కాలనీ, శారదానగర్ లలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. మారికవలస శివాలయం రోడ్డు మీదకు వస్తున్న మురుగునీరు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, కొమ్మాది సర్వే నెంబర్ 27 లో రజకులకు దోభీ ఘాట్ నిర్మించాలని కోరారు. ఆనందపురం మండలం బోని నుంచి ముకుందపురం చెరువు మీదుగా రోడ్డు నిర్మించాలని విన్నవించారు. మధురవాడ, భీమిలి జోన్ల నుంచి, భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాల నుంచి ప్రజలు తెలియజేసిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని గంటా ఆదేశించారు. కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```