బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

పెట్టుబడులు.. ఉపాధి దిశగా వేగవంతమైన చర్యలు :  కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

Bureau January 29, 2026 02:34 AM 17 views
పెట్టుబడులు.. ఉపాధి దిశగా వేగవంతమైన చర్యలు :  కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

 

విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనా దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌ మీటింగు హాలులో జరిగింది. జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు వేగవంతం చేసి, పెట్టుబడిదారులకు సహకారం అందించాలని చెప్పారు.

ఎంఎస్ఎంఈ నానో పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎం.ఓ.యు.ల అమలు స్థితి, పెట్టుబడుల ప్రగతిని తెలియజేసే ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్‌పై పర్యవేక్షణ మరింత పెరగాలని సూచించారు. అలాగే ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```