బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్

Bureau January 29, 2026 08:16 AM 27 views
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. విధ్వంసకర బ్యాటింగ్.. కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఏకపక్ష విజయాలు అందుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ ఎట్టకేలకు కళ్లెం వేసింది. విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా విఫలమైన టీమిండియా 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఎక్స్‌ట్రా బౌలర్‌తో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది.216 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(2) తీవ్రంగా నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ(2/33), ఇష్ సోధి(2/46) రెండేసి వికెట్లు తీసారు. మ్యాట్ హెన్రీ, జాక్ ఫోక్స్ తలో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(2) తీవ్రంగా నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ(2/33), ఇష్ సోధి(2/46) రెండేసి వికెట్లు తీసారు. మ్యాట్ హెన్రీ, జాక్ ఫోక్స్ తలో వికెట్ పడగొట్టారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```