బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త గా జీవీఎల్ నరసింహారావు నియామకం

Bureau January 29, 2026 02:32 AM 5 views
దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త గా జీవీఎల్ నరసింహారావు నియామకం

కేంద్ర బడ్జెట్‌లోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్‌గా మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కేంద్ర పార్టీ నియమించింది. 

కేంద్ర బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు కల్పించిన ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర పార్టీలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో వివరించే బాధ్యత జీవీఎల్ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాలలో జరుగనున్నది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడ్జెట్ పై  దక్షిణాది రాష్ట్రాలలో జరుగనున్న ప్రత్యేక  ప్రచార కార్యక్రమానికి ఆయన సారథ్యం వహిస్తారు.

ఈ క్యాంపెయిన్‌లో భాగంగాదక్షిణాది రాష్ట్రాల్లో పట్టణాలు మొదలుకుని నగరాల వరకు  పేదలు, మహిళలు మొదలుకుని వివిధ వర్గాలతో సమావేశాలు, చర్చా వేదికల ద్వారా బడ్జెట్‌లోని ప్రధాన అంశాలను ప్రయోజనాలను ప్రజలకు  చేరవేయనున్నారు.  కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, రైతు మద్దతు వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం మరియు దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా  కేంద్ర పార్టీ  పేర్కొన్నది

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```