తాండవ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి మృతి ఒకరికి గాయాలు.
నాతవరం దివ్యదర్శని న్యూస్: గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి గాయాలు అయిన సంఘటన చోటుచేసుకుంది దీనికి సంబంధించి నాతవరం ఎస్ఐ వై ,తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ నగరం గ్రామానికి చెందిన చిట్టూరు శంకర్ (48) తల్లి చిట్టూరు గౌరమ్మ,(80), వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై గాజువాక నుండి తిరిగి వస్తుండగా తాండవ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి వానరం అడ్డంగా రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుమీద పడిపోవడంతో ఇద్దరికీ తలకు బలమైన గాయం కావడంతో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో తాళ్లపాలెం దగ్గరికి వెళ్లేసరికి తల్లి గౌరమ్మ మృతి చెందింది కుమారుడు శంకర్ కు గాజువాక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాతవరం పోలీసులు తెలిపారు.