బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ప్రమాదాలకు పిలుపు.. ఈ మలుపు...

Bureau February 13, 2026 06:11 PM 8 views
ప్రమాదాలకు పిలుపు.. ఈ మలుపు...

ప్రమాదాలకు పిలుపు.. ఈ మలుపు...

 తరచుగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
 భయాందోళనలో వాహనదారులు
 సూచిక బోర్డు పెట్టాలని స్థానికుల మనవి
 
516 ఈ జాతీయ రహదారి మండలంలోని అంత్రిగుడ మలుపు తరచు ప్రమాదాలతో ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు భయంతో గురవుతున్నారు. తరచుగా ఈ మలుపు వద్ద ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. గత నెల 24న రెండు ద్విచక్ర వాహనాలు అదే మలుపు వద్ద ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతోపాటు గతంలో జరిగిన పలు యాక్సిడెంట్లలో పలువురు చనిపోయి ఉన్నారు. తాజాగా శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు అదే మలుపు వద్ద ప్రమాదవశాత్తు కొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని వైద్య చికిత్సల నిమిత్తం 108 అంబులెన్స్  లో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అక్కడ తరచుగా ప్రమాదాలు జరిగి మృత్యువాత చెందుతున్న ప్రమాదాల నివారణకు ఏ అధికారులు కూడా పట్టి పట్టనట్లు వ్యవహరించడం విచారకరమని స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు పలువురు అంటున్నారు. అరకులోయ పర్యాటక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం చాపరాయి జలపాతం సమీపంలో ఉండడంతో అరకులోయ సందర్శించిన పర్యాటకులు అధిక సంఖ్యలో చాపరాయి జలపాతంలో తిలకించడానికి వస్తున్నారు. దీంతో ఈ జాతీయ రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కాగా ప్రమాదాల నివారణకు అక్కడ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అంత్రిగుడ మలుపు వద్ద ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు పర్యాటకులు, వాహనదారులు ప్రయాణికులు, పలువురు కోరుతున్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```