బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

జివిఎంసి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Bureau January 27, 2026 06:48 AM 6 views
జివిఎంసి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్:  విశాఖ నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా జివిఎంసి లో అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా పని చేస్తున్నామని జివిఎంసి కమీషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను నగర మేయర్ పీలా శ్రీనివాస రావు, డిప్యూటీ మేయర్లు కట్టమూరి సతీష్, దల్లి గోవింద రాజు, అధికారులతో కలసి ఎగుర వేసారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జివిఎంసి ప్రధాన కార్యాలయం ఆవరణలో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్, మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాస రావు, డిప్యూటీ మేయర్లు కట్టమూరి సతీష్, దల్లి గోవింద రాజులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సాధనకు కృషి చేసిన నాయకుల సేవలను గుర్తు చేస్తూ వారి అందరికి వందనాలు అర్పించారు.

అనంతరం జివిఎంసి కమీషనర్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర సాధనకు కృషి చేసిన మహానుభావులందరికీ వందనాలను తెలియజేసారు. విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, జివిఎంసి ప్రగతి నివేదికను వినిపించారు. జివిఎంసి విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు వారి ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్దని పాటించాలని కమీషనర్ సూచించారు. అనంతరం జివిఎంసి లో విధి నిర్వహణ లో ప్రతిభను కనబరచిన అధికారులకు, ఉద్యోగులకు, నివాసిత సంక్షేమ సంఘాలు, పలు బ్యాంకుల ప్రతినిధులకు, సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన జివిఎంసి బాల్యం విద్యార్ధిని విద్యార్దులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 

విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న నగర ప్రజలు, కౌన్సిల్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎస్.హెచ్.జి మహిళలు, ఆర్పీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విలేకరులకు కృతజ్ఞతలును తెలిపారు. ఈ సందర్భంగానే జి వి ఎం సి అభివృద్ధి కార్యక్రమాలను జోడిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన శకటానికి జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో జివిఎంసి కి  ప్రధమ స్థానం దక్కిందని కమీషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ప్లోర్ లీడర్ 33వ వార్డు కార్పోరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి, కార్పోరేటర్లు కందుల నాగరాజు, మాదంశెట్టి చిన్నతల్లి, మహమ్మద్ సాదిక్, బిపిన్ జైన్, జివిఎంసి అదనపు కమీషనర్లు పిఎం.సత్యవేణి, ఎస్.ఎస్.వర్మ, డి.వి.రమణ మూర్తి, పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీరు పి.వి.సత్యనారాయణ రాజు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జోనల్ కమీషనర్లు, ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, పలు బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```