అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఎ ప్రాంగణం లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో జాతీయ జెండాను ఐటిడిఎ పిఓ తిరుమణి శ్రీ పూజ ఆవిష్కరించారు. అనంతరం ఐటిడిఏ లో వివిధ విభాగాలు సేవలందిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవార్డులను ప్రధానం చేశారు. ముందుగా స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం మల్లుదొర, బిర్సా ముండా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పరిపాలనాధికారి ఎం. హేమలత, డిఆర్డిఏ పిడి వి. మురళి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి.బి.కె పరిమళ, ,జిల్లా వైద్యానికి శాఖ అధికారి డాక్టర్ కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది, టి డి ఏ సిబ్బంది, వెలుగు సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.