బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

Bureau April 27, 2026 04:19 AM 8 views
గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 
- గూగుల్ శంకుస్థాపనతో విశాఖ భవితవ్యానికి చారిత్రాత్మక మలుపు 
- చంద్రబాబు విజన్–లోకేష్ కృషి ఫలితం… 
- ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ ఎఐ టెక్ యుగారంభం 
 - టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 
 విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ * ఎల్లుండి జరగబోయే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విశాఖపట్నం సర్వం సిద్ధమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 15 బిలియన్ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు) విపులమైన పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్టు 2028 జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తినిస్తూ, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… "ఈ శంకుస్థాపనతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక మౌలిక వసతులు, భారీ పెట్టుబడులు, ఐటీ ఆధారిత పరిశ్రమలతో విశాఖ నగరం గ్లోబల్ ఎఐ హబ్‌గా అవతరించి, దేశంలోనే అగ్రశ్రేణి టెక్నాలజీ నగరంగా ఎదగనుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంధనంగా నిలిచి, యువత భవిష్యత్తును మార్చే గేమ్‌చేంజర్‌గా మారుతుంది" అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పెట్టుబడులకు అనుకూల విధానాలు, పరిపాలనా చురుకుదనం వలన గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయని పల్లా గారు కొనియాడారు. అభివృద్ధిని కార్యాచరణగా మార్చే నాయకత్వం ఆయనదేనని, విజన్‌ను వాస్తవంగా మలిచే నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ గారి నిరంతర కృషి, వ్యూహాత్మక దృష్టి, వేగవంతమైన అమలు సామర్థ్యమే ఈ భారీ పెట్టుబడికి పునాది వేసిందని పల్లా గారు ప్రశంసించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమన్వయం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనే ద్వంద్వ సూత్రాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎకనమిక్ టైమ్స్ సంస్థ అందజేసిన “బిజినెస్ రిఫార్మర్ అవార్డు” ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని తెలిపారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హార్టీకల్చర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, విజన్ 2020తో అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు గారు, విజన్ 2047తో నవ్యాంధ్రను దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పల్లా గారు కొనియాడారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం టెక్నాలజీ, పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దుకుని మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవం లభించి, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ఇది కేవలం ఒక డేటా సెంటర్ ప్రాజెక్టు మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే అభివృద్ధి యుగానికి నాంది పలికే మహత్తర ఘట్టమని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. గూగుల్ పెట్టుబడి రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌పై మరింత పటిష్టంగా నిలబెట్టే చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```