ఒమ్మంగి శివారులో గుండాట స్థావరంపై ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం మెరుపు దాడి
--ఆరుగురు అరెస్ట్,రూ.15700 నగదుతో పాటు గుండాట సామాగ్రి స్వాధీనం
--ఎస్సై లక్ష్మీకాంతం
ప్రత్తిపాడు,దివ్యదర్శిని న్యూస్..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి శివారులో బహిరంగ ప్రదేశంలో రహస్యంగా నిర్వహిస్తున్న గుండాట స్థావరంపై ఎస్సై ఎస్ లక్ష్మికాంతం తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు.ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం తెలిపారు.నిందితుల నుంచి రూ.15700 నగదు,9 పాచికలు,గుండాట ఫ్లెక్సీతో పాటు గుండాట సామాగ్రిని స్వాధీనం చేసుకుని,వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఎస్పీ జి బిందు మాధవ్,పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు ఉత్తర్వులతో అసాంఘిక కార్యకలాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని,అందులో భాగంగా సిఐ బిఎస్ అప్పారావు పర్యవేక్షణలో ఒమ్మంగి శివారులో రాబడిన సమాచారం మేరకు గుండాట స్థావరంపై దాడి చేయడం జరిగిందన్నారు.మండలంలో కోడిపందాలు,గుండాట,పేకాట వంటి జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్సై లక్ష్మీకాంతం హెచ్చరించారు.