ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నెల్లిమర్ల, దివ్య దర్శిని న్యూస్ :
నెల్లిమర్ల గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎం గోడౌన్‌లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
ప్రతినెల నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్, భద్రతా ఏర్పాట్లు, గోడౌన్ తాళాలు మరియు శీళ్లను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాగర్, స్థానిక తహసిల్దార్ కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.