బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఇండియన్ గ్యాస్ సరఫరాలో   వినియోగదారులు తీవ్ర ఇబ్బందు

Bureau May 08, 2026 05:22 AM 4 views
ఇండియన్ గ్యాస్ సరఫరాలో   వినియోగదారులు తీవ్ర ఇబ్బందు

ఇండియన్ గ్యాస్ సరఫరాలో 
 వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు.

గొలుగొండ, దివ్యదర్శిని 

గొలుగొండ మండలంలో ఇండియన్ గ్యాస్ సరఫరా నిర్వహిస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సప్లై దారులపై వినియోగదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుంచి ఓటీపీలు సేకరించి, అసలు వినియోగదారులకు సిలిండర్లు అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల పేర్లపై బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్లను వారి అనుమతి లేకుండానే డెలివరీ అయినట్లు చూపించి, ఆ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వ్యాపార అవసరాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యల వల్ల సాధారణ కుటుంబాలకు గ్యాస్ అందక రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళలు వాపోతున్నారు.
కొంతమంది వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లకు వచ్చిన ఓటీపీని “డెలివరీ ప్రక్రియ కోసం” అని చెప్పి తీసుకుని, ఆ తర్వాత సిలిండర్ తమకు అందకపోయినా డెలివరీ పూర్తయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో నిజమైన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, మళ్లీ కొత్త బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. బొలెరో వాహనంపై గ్యాస్ సప్లై చేసే నిర్వాహకులు మాత్రం కస్టమర్లను చీదరించుకుంటూ అభ్యంతరకర సమాధానం చెబుతూ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 
ఈ వ్యవహారంపై సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు....

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

13 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```