బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ఆదివాసి నిరుద్యోగుల హక్కుల కోసం బి.టి.ఏ గళం 

Bureau January 29, 2026 02:27 AM 4 views
ఆదివాసి నిరుద్యోగుల హక్కుల కోసం బి.టి.ఏ గళం 

 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి.టి.ఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివాసి నిరుద్యోగులు చేపట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు కల్పించి ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా కాలరాస్తున్న ప్రభుత్వ విధానాల వల్ల ఆదివాసి యువత తీవ్రంగా నష్టపోతున్నారని బి.టి.ఏ నాయకులు మండిపడ్డారు.

గతంలో ఆదివాసి ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో 100 శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే కేటాయించేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ హక్కును కుదించి కేవలం 6 శాతం మాత్రమే వర్తింపజేయడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు.

 జీవో నెంబర్–3 రద్దుతో ఆదివాసుల మనుగడకే ప్రమాదం

ఆదివాసులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో జీవో నెంబర్–3 రద్దు చేయడం వల్ల వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందని బి.టి.ఏ ఆవేదన వ్యక్తం చేసింది.
ఉద్యోగ అవకాశాలు లేక ఆదివాసి ప్రాంతాల్లోని విద్యార్థులు, యువత గ్రామాల్లోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల ఆదివాసుల సమగ్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని తెలిపారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```