బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్యం బహిర్గతం

Bureau February 12, 2026 11:51 AM 4 views
బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్యం బహిర్గతం

 

ఆకస్మిక తనిఖీలో లోపాలు గుర్తించిన పీఓ తిరుమణి శ్రీ పూజ

హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు – ఉపాధ్యాయులకు కఠిన హెచ్చరికలు

దివ్య దర్శిని న్యూస్ అల్లూరి జిల్లా/ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 12:

మండలంలోని బంగారుమెట్ట జీటీడబ్ల్యూఏ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యా నిర్వహణలో తీవ్ర లోపాలు వెలుగుచూశాయి. గురువారం పీఓ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీ పూజ ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలకు చేరుకున్న వెంటనే తరగతి గదులను పరిశీలించిన పీఓ, విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సౌకర్యాలు, బోధన స్థాయి వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు పాఠాలు సరిగా అర్థం కావడం లేదని, బోధన సమర్థవంతంగా సాగడం లేదని వెల్లడించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యా ప్రమాణాలను పాటించడంలో వైఫల్యం, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో ప్రధానోపాధ్యాయుడిపై తక్షణ సస్పెన్షన్ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఉపాధ్యాయులను తీవ్రంగా మందలించిన ఆమె, బోధనలో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైనే ఉందని, పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశ్రమ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు పరిపాలన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పీఓ వెల్లడించారు.

ఈ సంఘటనతో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```