బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

అభివృద్ధి పనులకు గంటా శంకుస్థాపన

Bureau February 09, 2026 05:51 PM 3 views
అభివృద్ధి పనులకు గంటా శంకుస్థాపన

 

భీమిలి దివ్యదర్శిని న్యూస్::కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ. 160 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. 2 వ వార్డు పరిధిలోని సబ్బివాని పేట, దొరతోట, డెక్కాతి పేట, సంగివలస, రాజలింగం పేట, కుమ్మరివీధి తదితర ప్రాంతాల్లో రూ. 4.15 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి హయాంలో వెల్లువలా అభివృద్ధి పనులు  జరుగుతున్నాయని తెలిపారు. 2014-19 మధ్య భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా రికార్డు స్థాయిలో రూ. 4,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.  ఇప్పుడు అదే స్థాయిలో అభివృద్ధి చేసి 93 వేల రీసౌండ్ మెజారిటీ ఇచ్చిన భీమిలి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో భీమిలి జోనల్ కమిషనర్ టి. నాగేంద్ర కుమార్, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు గంటా నూకరాజు, జీరు సత్యం, తమ్మిన సూరిబాబు, దండి వెంకటేష్, కొప్పల రమేష్, గొలగాని నరేంద్ర, పాసి నరసింగరావు, సూరాల సత్య వర ప్రసాద్, గరికిన కింగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```