నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ను అందజేశారు.
గోలుగొండ మండలం, చీడిగుమ్మల గ్రామానికి చెందిన యెన్నేటి లోవ లావణ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నర్సీపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి వైద్య ఖర్చుల నిమిత్తం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఫార్సు మేరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 48,823 మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం నుండి మంజూరైన CMRF ను చింతకాయల విజయ్ ఈరోజు స్వయంగా బాధితులకు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు వేణు గోపాల్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు
అనారోగ్య బాధితులకు అండగా ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌వోసీ అందజేసిన చింతకాయల విజయ్
Bureau
January 27, 2026 06:44 AM
15 views
Related News
No related news found.
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N