దివ్య దర్శిని న్యూస్ (అల్లూరి జిల్లా) పాడేరు :
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల ఫిబ్రవరి 9: అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతి పది రోజులకు ఒకసారి ఆయా మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లాలోని జిమాడుగుల మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారుల సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అధికారులు మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ప్రాణాపాయంలో ఉన్న రోగులకు తామిచ్చిన రక్తం వారి ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఔత్సాహికులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గల జి జి హెచ్ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జి జి హెచ్ బ్లడ్ బ్యాంక్ లో అన్నివేళలా రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఔత్సాహికులు రక్తదానం చేసి తమకు సహకారం అందించాలని కోరారు. ఈ రక్తదాన శిబిరానికి 29 యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డేవిడ్ రాజు తహసిల్దార్ రాజ్ కుమార్ ఏ టి డబ్ల్యూ ఓ శిరీష దేవి సిడిపిఓ బాలచంద్రామణి ఎస్ ఐ సాయి పాడల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు సభ్యులు టి ప్రసాద్ నాయుడు,సుబ్రహ్మణ్యం,రవి,సంజీవ్ డాక్టర్ రాఘవేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.