ఆటో డ్రైవర్లు విధిగా లైసెన్సులు కలిగి ఉండాలి:
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సాయి రమేష్:
ఆటో డ్రైవర్లు అందరూ తప్పని సరిగా లైసెన్సులు కలిగి ఉండాలని స్థానిక మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సాయి రమేష్ అన్నారు. మండలంలోని అరకు సంతబయలులో శుక్రవారం డుంబ్రిగుడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సురేష్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సాయి రమేష్ మట్లాడుతూ డ్రైవర్లందరూ విధిగా లైసెన్సులు పొందాలని సూచించారు. అలాగే వాహనాలు నడిపే సమయంలో సెల్ ఫోన్లు మాట్లడరాదని చెప్పారు. అంతే కాకుండా పరిమితికి మించి ప్రయాణికులు వాహనాల్లో ఎక్కించవద్దని చెప్పారు. అలాగే వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపరాదని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ సురేష్ మాట్లాడుతూ డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కొందరికి వెంటనే లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.